పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్​ ఓవరాక్షన్… నెటిజన్ ట్వీట్​తో అరెస్ట్​​

హైదరబాద్‌ భోలక్‌పూర్‌ ఎంఐఎం కార్పొరేటర్‌ గౌసుద్దీన్​ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న కేసులో అరెస్టు చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఎంఐఎం కార్పొరేటర్​పై చర్యలు తీసుకోవాలని ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్​పై స్పందించిన కేటీఆర్… పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వాళ్లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. రాష్ట్రంలో ఇటువంటి వాటికి తావులేదని, తప్పు చేసిన వాళ్లపై రాజకీయ పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాల్సిందేనని ట్విట్టర్​లో డీజీపీకి కేటీఆర్ సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కార్పొరేటర్​ను అరెస్ట్ చేశారు.

ఏం జరిగిందంటే…
భోలక్‌పూర్‌ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హోటళ్లను మూసివేయించేందుకు వెళ్లిన పోలీసులపై కార్పొరేటర్​ గౌసుద్దీన్‌ వాగ్వాదానికి దిగారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. తమాషాలు చేస్తున్నారని, తమ డ్యూటీ చేసుకొని వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. తమ డ్యూటీ తాము చేస్తున్నామని ఓ కానిస్టేబుల్‌ అనగానే నువ్వు 100 రూపాయల వ్యక్తివి… నాకు సమాధానం చెబుతావా అంటూ దురుసుగా మాట్లాడారు. మీ ఎస్సైని పిలువు.. కార్పొరేటర్‌ వచ్చాడని చెప్పు అంటూ అధికార స్వరంతో హెచ్చరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతనిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్​కు ఓ నెటిజన్ ట్వీట్​ చేయడంతో పోలీసుల అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published.