సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. నటి సూసైడ్​

bidisha de majumdar

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. బెంగాలీ నటి, మోడల్​ 21 ఏళ్ల బిదిషా డి మజుందార్​ సూసైడ్​ చేసుకుంది. గురువారం ఉదయం కోల్​కతాలోని తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. తాను ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలను చెబుతూ ఓ సూసైడ్​ నోట్​ రాసినట్లు సమాచారం. బిదిషా 2021లో అనిర్బేద్​ చటోపాధ్యాయ డైరెక్షన్​లో భార్​ ది క్లౌన్​ షార్ట్ ఫిల్మ్​లో నటించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నటి ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు, స్థానికులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.