Banjara Hills Pub Case: రాడిసన్ పబ్‌లో డ్రగ్స్… పబ్‌లో నిహారిక, సింగర్ రాహుల్

Banjara Hills Pub Case: హైదరాబాద్‌లో కీలక ప్రాంతంలో డ్రగ్స్ కలకలం రేగింది. బంజారాహిల్స్ రాడిసన్ హోటల్లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో మాదకద్రవ్యాలు బయటపడ్డాయి. పక్కా సమాచారంతో రాత్రి పబ్‌పై దాడులు నిర్వహించి మత్తుపదార్తాలు పట్టుకున్నారు. పబ్‌లో అదుపులోకి తీసుకున్నవారిలో…. సినీనటి నిహారిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నారు. ఈ పబ్ ఓ మాజీ ఎంపీ కూతురిదని తెలుస్తోంది.
నిహారికతోపాటు రాహుల్…
Banjara Hills Pub Case: హైదరాబాద్‌లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో డ్రగ్స్ బయటపడటం కలకలం సృష్టించింది. పుడింగ్ అండ్ మింక్ పబ్‌పై జరిపిన దాడుల్లో ఎల్ఎస్డీ, కొకైన్, గంజాయి వంటి వివిధ మత్తు పదార్థాలు పబ్‌లో దొరికాయి. అధికారులు అక్కడికి చేరుకోగానే పలువురు మత్తుపదార్థాలను విసిరేసినట్లు తెలుస్తోంది. పబ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు… యజమాని సహా 144 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇందులో సినీనటి నిహారిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్నవారందనీ విచారించిన పోలీసులు… వారి వివరాలు సేకరించి వదిలేశారు. అసలు పబ్‌లోకి డ్రగ్స్ ఎలా చేరాయి? ఎవరెవరు మత్తుపదార్థాలు తీసుకున్నారనే విషయాలు సంచలనం రేపుతున్నాయి.
డ్రగ్స్ ఎలా వచ్చాయి?
Radisson Pub Case: పబ్‌లో డ్రగ్స్ బయటపడం.. అందులో ప్రముఖులు ఉండటంతో పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక దృష్టిసారించారు. నిబంధనలకు మించి పబ్ నడిపినందుకు కేసు నమోదు చేశారు. నార్కొటిక్ కంట్రోల్ వింగ్ సహా మూడు బృందాలు ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయి. పబ్ మేనేజర్‌ను సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. పబ్‌లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో అనుమానితుల కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడినుంచి వచ్చాయో తమకు తెలియదని పబ్ నిర్వాహకులు పోలీసులకు వివరించినట్లు సమాచారం. దీంతో క్లూస్ టీం ద్వారా పబ్‌లో వివరాలు సేకరిస్తున్న పోలీసులు… సాంకేతిక అంశాలతో దర్యాప్తు చేస్తున్నారు.
కేసు వేగవంతం…
Niharika, Rahul Arrested: బంజారాహిల్స్ పబ్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. డీజే ఆపరేటర్ వంశీధర్‌రావు , పబ్ నిర్వాహకుడు అభిషేక్, ఈవెంట్ మేనేజర్ అనిల్, వీఐపీ మూమెంట్ చూసే కునాల్‌ను విచారిస్తున్నారు. పబ్‌లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోసం ల్యాబ్‌కు పంపించారు. సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. మరోవైపు పోలీసు అధికారులతో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీపీ ఆనంద్ అత్యవసర భేటీ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాచారం తెలుసుకున్నారు. వెస్ట్‌జోన్‌లోని ఎస్ఐలు, డిటెక్టివ్ సీఐలు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.