A Mother Punish Her Daughter : చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసి ఎండలో పడుకోబెట్టిన తల్లి..

Baby
A Mother Punish Her Daughter : పిల్లలు హోం వర్క్ చేయలేదంటే బెదిరించడమో.. బుజ్జగించమో.. అంతకీ మొండికేస్తే.. చిన్నగా దండించడమో చేస్తుంటారు. కానీ ఓ తల్లి విచక్షణ కోల్పోయి కడుపున పుట్టిన చిన్నారి అని కూడా చూడకుండా దారుణానికి ఒడిగట్టింది. చిన్నారి చేతులు, కాళ్లు కట్టేసి మండుటెండలో డాబాపై పడుకోబెట్టింది. పైన కాస్తున్న ఎండకు.. కింద కాలుతున్న వేడికి తాళలేక చిన్నారి కేకలు వేసి బతిమాలినా ఆమె కనికరించలేదు. ఈ దారుణ ఘటనను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. చివరికి ఈ వీడియో పోలీసులకు చేరడంతో వారు రంగంలోకి దిగారు.
ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని ఖజూరీఖాస్ లో జరిగింది. చిన్నారి హోం వర్క్ చేయనందున తల్లి ఇంతటి దారుణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోను పొరుగింట్లో ఉన్న వ్యక్తి తీసి పోలీసులకు ట్యాగ్ చేశాడు. తల్లి దుశ్చర్యను చూసిన నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.
Read Also : ఆడపిల్ల పుట్టిందని ఒవెన్లో పెట్టి చంపింది!