బాలికపై గ్యాంగ్​ రేప్​.. ఆపై లైవ్​ స్ట్రీమింగ్

rape

దేశవ్యాప్తంగా వెలుగుచూస్తున్న అత్యాచారాలు ఆడపిల్లల తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రోజూ ఎక్కడో చోట అత్యాచారాలు, ఆపై హత్యలు మహిళల మాన ప్రాణ రక్షణ ఎంత దీనస్థితిలో ఉందో కళ్లకు కడుతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు ఎన్ని చట్టాలు తెచ్చినా… దోషులను ఎంత కఠినంగా శిక్షించినా ఆశించిన మేర ప్రయోజనం లేకుండా పోతోంది. ఓ 18 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు గ్యాంగ్​ రేప్​ చేశారు. అంతేకాకుండా అత్యాచారం చేస్తున్న సమయంలో ఆ వీడియోను తన ఫ్రెండ్​కు లైవ్​లో స్ట్రిమింగ్​ చేశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. ఈ ఘటన జూన్​ 2 జరగ్గా.. శుక్రవారం బాధితురాలు పోలీసులను ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.


21 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు వ్యక్తులు.. జూన్​ 2న ఓ హోటల్​లో అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదుచేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ వీడియోలను మరో ఫ్రెండ్​కు లైవ్​ స్ట్రీమింగ్​ చేసినట్లు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఆయా ఫొటోలు, వీడియోలు సోషల్​ మీడియాలో సైతం షేర్​ చేసినట్లు బాధితురాలు ఫిర్యాదుచేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.