రాష్ట్రంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

corona cases

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు (Telangana Corona Cases) భారీగా తగ్గాయి. గురువారం 31 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,91,284 మంది కరోనా బారిన పడ్డారు. 73 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 7,86,753 మందికి చేరింది. ఇప్పటి వరకు 4,111 మంది మహమ్మారికి బలయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 619 యాక్టివ్ కేసులు (Telangana Corona Cases) ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 18,244 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇంకా 786 మంది రిపోర్ట్స్​ రావల్సి ఉంది. ఇప్పటివరకు 3,42,07,735 నిర్ధారణ పరీక్షలు చేశారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.51 శాతం, రికవరీ రేటు 99.42 శాతంగా ఉంది. 26 జిల్లాల్లో కేసులు నమోదు కాలేదు. 6 జిల్లాల్లో 10లోపు కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో 23 మంది కొవిడ్ బారిన పడ్డారు.

తాజాగా వచ్చిన కేసుల్లో ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 0, జీహెచ్​ఎంసీ 23, జగిత్యాల 0, జనగామ 0, జయశంకర్ భూపాలపల్లి 0, జోగులాంబ గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 1, ఖమ్మం 0, కొమురంభీం ఆసిఫాబాద్ 0, మహబూబ్​నగర్ 0, మహబూబాబాద్ 2, మంచిర్యాల 0, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 1, ములుగు 0, నాగర్​కర్నూల్ 0, నల్గొండ 0, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 0, పెద్దపల్లి 0, రాజన్న సిరిసిల్ల 0, రంగారెడ్డి 0, సంగారెడ్డి 1, సిద్దిపేట 0, సూర్యాపేట 0, వికారాబాద్ 0 వనపర్తి 1, వరంగల్ 0, హనుమకొండ 0, యాదాద్రి భువనగిరి 0 చొప్పున నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published.