JIO 5G PHONE: త్వరలోనే జియో 5జీ ఫోన్.. ధర, ఫీచర్లు ఏమిటంటే..

Reliance Jio 5G

Reliance Jio 5G

JIO 5G PHONE : సామాన్యులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు 5జీ నెట్ వర్క్​ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జియో సంస్థ సమాయత్తమవుతోంది. అందుబాటు ధరల్లో స్మార్ట్ ఫోన్ అందించాలనే లక్ష్యంతో గతేడాది జియో ఫోన్ నెక్ట్స్ ను తీసుకొచ్చిన ఆ సంస్థ అతి త్వరలోనే అందుబాటు ధరలో 5జీ ఫోన్​ను తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది దసరా లేదా సంవత్సరాంతానికి జియో 5జీ ఫోన్ మార్కెట్​లోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

JIO 5G PHONE : భారతదేశం అంతటా ప్రపంచంలోని అత్యంత అధునాతన 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి డిజిటల్ కనెక్టివిటీ, డిజిటల్ సొల్యూషన్స్‌లో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆకాశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే…

ఫోన్ ఫీచర్లు ఏమిటంటే..
6.5అంగులాల హెచ్​డీ ఐపీఎస్ ఎల్ఈడీ డిస్​ప్లే
స్నాప్​డ్రాగన్ 480 5జీ ప్రాసెసర్.
13మెగాఫిక్సల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2ఎంపీ కెమెరా.
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా.
5000 ఎంఏహెచ్ బ్యాటరీ.
ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ కూడా ఉండే అవకాశం ఉంది.
4జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉన్నట్లు సమాచారం.

ఇక ఈ ఫోన్ ధర రూ. 10నుంచి రూ.12 మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచణా వేస్తున్నాయి.

Read Also : SIIMA 2021 AWARDS : సైమా 2021 నామినేషన్స్ ప్రక్రియ పూర్తి.. తగ్గేదే లేదంటున్న పుష్ప

Leave a Reply

Your email address will not be published.